Showing posts with label ashokkadaba#sathyam#telugu#movie#ranjiniraghavan. Show all posts
Showing posts with label ashokkadaba#sathyam#telugu#movie#ranjiniraghavan. Show all posts

Tuesday, 4 August 2020

sathyam new telugu movie కన్నడ చిత్ర దర్శకుడు అశోక్ కడాబా బిగ్ బడ్జెట్ తెలుగు చిత్రం

 శ్రీ మాతా క్రియేషన్స్‌పై మహంతేష్ నిర్మిస్తోన్న 'సత్యం' చిత్రానికి అశోక్ కె కడాబా దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. కేవీ రాజు డైలాగ్స్ అందిస్తుండగా, సినీ టెక్ సూరీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం.  అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.